తెలుగు

దూరం దూరం దూరం
ఓఓఓ తీరం లేని దూరం
ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన
చెరో ప్రశ్నల్లె మిగిలినారే
ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన
చెరో ప్రపంచం చేరినారే
ఒకే గతాన్ని ఓఓఓ ఒకే నిజాన్ని ముడేసినారే ఓఓఓ
ఓఓఓ ఓఓఓ ఓఓఓ
చెరో సగాన్ని
ఓఓఓ మరో జగాన్ని వరించినారే ఓఓఓ
ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన
చెరో ప్రశ్నల్లె మిగిలినారే
దూరం దూరం దూరం
ఓఓఓ తీరం లేని దూరం ఓఓఓ

ఇంత దగ్గర అంతులేని దూరం
ఇంత కాలము దారి లేని దూరం
జంట మధ్య చేరి వేరు చేసే దారే
నాదే అన్నాథే
హూ
స్నేహమంటూ లేక ఒంటరైన దూరం
చుట్టమంటూ లేని మంట తోనే దూరం
బంధనాలు తెంచుతూ ఇలా బలేగా మురిసే
ఎడబాటులో చేదు తింటూ దూరం ఎదుగుతున్నదే
విరహాల చిమ్మ చీకటింటా దూరం వెలుగుతున్నదే
ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన
చెరో ప్రశ్నల్లె మిగిలినారే
దూరం దూరం దూరం
ఓఓఓ తీరం లేని దూరం

ఒక్క అడుగు వెయ్యలేని దూరం
ఒక్క అంగుళం వెళ్లలేని దూరం
ఏడూ అడుగుల చిన్ని దూరాన్ని
చాలా దూరం చేసిందే
మైలు రాయి కొక్క మాట మార్చు
దూరం దూరం
మలుపు మలుపు కొక్క దిక్కు మార్చు
దూరం దూరం
మూడు మూళ్ళ ముచ్చటే మూళ్ళ బాటగా మార్చే
తుది లేని జ్ఞాపకాన్ని తుడిచి వేసే దూరమన్నది
మొదలైన చోటు మరచిపోతే కాదే పయనమన్నది
ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన
చెరో ప్రశ్నల్లె మిగిలినారే
దూరం దూరం దూరం
ఓఓఓ తీరం లేని దూరం

Roman script

Dhooram dhooram dhooram
ooo Theeram leni dhooram
Oke parikshe rasina oke javabai saagina
chero prashnalle migilinare
Oke padavalo kalisina oke prayanam chesina
chero prapancham cherinare
Oke gathanni ooo oke nijanni uresinare ooo
ooo ooo ooo
chero saganni
ooo maro jaganni varinchinare ooo
Oke parikshe rasina oke javabai saagina
chero prashnalle migilinare
Dhooram dhooram dhooram
ooo Theeram leni dhooram Ooo

Intha daggara anthuleni dhooram
intha kalamu dhaari leni dhooram
janta madya cheri veru chese daare
naade annadhe
Hoo
Snehamantu leka ontaraina dhooram
chuttamantu leni manta thone dhooram
bandhanalu thenchuthu ila balega murise
edabatuloni chedu thintu dhooram eduguthunnade
virahala chimma cheekatintaa dhooram veluguthunnade…
Oke parikshe rasina oke javabai saagina
chero prashnalle migilinare
Dhooram dhooram dhooram
ooo Theeram leni dhooram

Okka adugu veyyaleni dhooram
okka angulam vellaleni dhooram
edu adugula chinni dhoranni
chaala dhooram chesinde
mailu raayi kokka mata marchu
dhooram dhooram
malupu malupu kokka dikku marchu
dhooram dhooram
mudu mulla muchate mulla bataga marche
thudi leni gnapakanni thudichi vese dhooramannadi
modalaina chotu marachipothe kade payana mannadi
Oke parikshe rasina oke javabai saagina
chero prashnalle migilinare
Dhooram dhooram dhooram
ooo Theeram leni dhooram

Song information

Singer: Tippu

Lyricist: Chandrabose

Album: 100%love

Explore this song