తెలుగు

స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో

స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో

నిండే దోసిలి పండే కౌగిలి
నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి
నన్నే కడిగెనులే

స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో

స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో

నిండే దోసిలి పండే కౌగిలి
నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి
నన్నే కడిగెనులే

ముసురేసిందమ్మా
కబురే కసిగా తెలిపీ
తడిగా ఒడినే దులిపీ

జడివానేమ్ చేస్తుందీ
జవరాలే తోడుంటే

తడిపేసిందమ్మా
తనువూ తనువూ కలిపీ
తనతో సగమే చేరిపీ

చలిగాలేం చేస్తుందీ
చెలికాడే తోడుంటే

ఆ మెరుపులకే
మెలి తిరిగే సొగసులతో
ఈ ఉరుములకే
ఉలికిపడే వయసులతో

కురిసింది వానా
తొలిగా పరువానా

స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో

నిండే దోసిలి పండే కౌగిలి
నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి
నన్నే కడిగెనులే

మతిపోయిందమ్మా
మనసు మనసు కలిసి
కథలు కళలు తెలిసీ

జలపాతం నీవైతే
అల గీతం నేనేలే

కసి రేగిందమ్మా
కళతో నిజమే కలిసి
దివినీ భువిని కలిపీ

సిరి తారలు తెస్తాలే
నీ వీరులే చేస్తాలే

ఈ చిటపటకే
శృతి కలిసే వలపులతో
ఈ తపనలకే
జత కలిసే తలపులతో

కురిసింది వానా
తొలిగా పరువానా

స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో
స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావళిలో

నిండే దోసిలి పండే కౌగిలి
నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి
నన్నే కడిగేనులే

Roman script

Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo

Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo

Ninde dosili pande kougili
Ninne adigenule
Neeto raatiri gadipe laahiri
Ninne kadigenule

Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo

Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo

Ninde dosili pande kougili
Ninne adigenule
Neeto raatiri gadipe laahiri
Nanne kadigenule

Musuresindammaa
Kabure kasigaa telipee
Tadigaa odine dulipee

Jadivaanem chestundee
Javaraale todunte

Tadipesindammaa
Tanuvu tanuvu kalipee
Tanato sagame cheripee

Chaligaalem chestundee
Chelikaade todunte

Aa merupulake
Meli tirige sogasulato
Ee vurumulake
Vulikipade vayasulato

Kurisindee vaanaa
Toligaa paruvaanaa

Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo

Ninde dosili pande kougili
Ninne adigenule
Neeto raatiri gadipe laahiri
Ninne kadigenule

Matipoyindammaa
Manasu manasu kalisee
Kathalu kalalu telisee

Jalapaatam neevaite
Ala geetam nenele

Kasi regindammaa
Kalato nijame kalisee
Divinee bhuvinee kalipee

Siri taaralu testaale
Nee virule chestaale

Ee chitapatake
Sruti kalise valapulato
Ee tapanalake
Jata kalise talapulato

Kurisindee vaanaa
Toligaa paruvaanaa

Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo
Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo

Ninde dosili pande kougili
Ninne adigenule
Neeto raatiri gadipe laahiri
Nanne kadigenule

Song information

Singer: S.P.Balasubramanyam,S Janaki

Lyricist: Veturi Sundararama Murthy

Album: Prema Yudham

Explore this song