తెలుగు

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగా పుట్టవా గీతికా హొయ్
స్నేహంతో మీటావా మెల్లగా

తొలి పొద్దంటి అందాలు
ఈనాడు నిద్దర లేచి
ముత్యాల ముగ్గులు పెట్టె
వన్నెల వాకిట్లో

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

ఉగ్గెట్ట పట్టాలో నలుగెట్ట పెట్టాలో
లాలెట్టా పోయాలోయమ్మ
ఓ రబ్బర్ బొమ్మ
లాలించేది ఎట్ట చెప్పమ్మా

మొగ్గంటి బుగ్గల్లో అగ్గల్లే
సిగ్గోస్తే జాబిల్లిని రప్పించాలయ్యో
ఓ ముద్దుల కన్నా
కౌగిట్లో జో కొట్టాలయ్యో

నా కంటి పాపల్లో
ఊయల వేయాలా
ఈ కొంటె పాపాయికి

ముందు మునుపులేని
ఈ పొద్దటి వెన్నెల ఆవిరిలో
ముద్దు మురిపాలన్నీ
పండించేది ఎట్టాగో

ఇక ఏ పేరు పెట్టాలో
ఇన్నాళ్లు ఎరగని
ఈ కొంటె చక్కిలి గింతల
ఉక్కిరి బిక్కిరికి

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

నీ కోసం పుట్టాను నిలువెల్లా పూసాను
గుండెల్లో గూడె కట్టాను
నా బంగరు గువ్వా
గుమ్మములో చూపులు కట్టాను

నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను
కళ్ళల్లో కాపురం ఉంటాను
నా పచ్చని కొమ్మ
పొమ్మన్న పక్కకి పోలేను

శృంగార స్నేహాల
సంకెళ్లు వేయాలా
సింగారి చిందాటతో

ఉరికే గోదారంటి
నా ఉడుకు దుడుకు తగ్గించి
కొంగున కట్టేసేటి
కిటుకేదో చెప్పమ్మా

పసి పరువాలు చూస్తుంటే
బరువైన కన్నుల్లో
పగలేదో రేయేదో
తెలియదు లేవయ్యా

పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ

మౌనంగా పుట్టవా గీతికా హొయ్
స్నేహంతో మీటావా మెల్లగా

తొలి పొద్దంటి అందాలు
ఈ నాడు నిద్దర లేచి
ముత్యాల ముగ్గులు పెట్టె
వన్నెల వాకిట్లో

Roman script

Podunne puttindi chandamaama
Moggalle vicchindi muddugumma
Mounamga puttava geetika hoy
Snehamtho meetaava mellaga

Tholi poddanti andaalu
Ee naadu niddara lechi
Mutyaala muggulu pette
Vannela vaakitlo

Podunne puttindi chandamaama
Moggalle vicchindi muddugumma

Uggetta pattaalo
Nalugetta pettaalo
Laletta poyaaloyamma
O rabbar bomma
Laalinchedetta cheppamma

Mogganti buggallo
Aggalle siggoste
Jabillini rappinchaalayo
O muddula kanna
Kougitlo jo kottaalayo

Naa kanti paapallo
Uyyaala veyyala
Ee konte paapaayiki

Mundhu munupuleni
Ee podduti vennela aavirilo
Muddu muripaalanni
Pandinchedettaago

Ika e peru pettaalo
Inaallu erugani
Ee konte chakkili gintala
Ukkiri bikkiriki

Podunne puttindi chandamaama
Moggalle vicchindi muddugumma

Nee kosam puttaanu
Niluvella poosaanu
Gundello goode kattaanu
Naa bangaru guvva
Gummamlo choopulu kattaanu

Nee nestam kattaanu
Nee daare pattaanu
Kallallo kaapuram untaanu
Naa pacchani komma
Pommanna pakkaki polenu

Srungaara snehaala
Sankellu veyaala
Singaari chindaatato

Urike godaaranti
Naa uduku duduku tagginchi
Konguna kattese nee
Kitukedo cheppamma

Pasi paruvaalu choostunte
Baruvaina kannullo
Pagaledo reyedo teliyadu levayya

Podunne puttindi chandamaama
Moggalle vicchindi muddugumma

Mounamga puttava geetika hoy
Snehamtho meetava mellaga

Tholi poddanti andaalu
Ee naadu niddara lechi
Mutyaala muggulu pette
Vannela vaakitlo

Song information

Singer: K.S. Chitra,S.P.Balasubramanyam

Lyricist: Sirivennela Seetharama Sastry

Album: Shatruvu

Explore this song